తిరుమల, బతుకమ్మ : టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిలో మరోసారి డొల్లతనం బయటపడింది. ఆలయ మహాద్వారం వరకు కొందరు భక్తులు చెప్పులతో వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు 3 చోట్ల తనిఖీలు చేస్తారు. భక్తులు చెప్పులు ధరించి వచ్చిన విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేదు. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
