26.2 C
Hyderabad

లక్కీ డ్రా విజేతలకు లడ్డూ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : ఏర్గట్ల మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సహృదయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు లక్కీ డ్రాలో  గెలుపొందిన విజేతలకు లడ్డూ అందజేశారు. మొదటి లడ్డు లక్కీ డ్రా విజేతగా ఏర్గట్లకు చెందిన తంగలపల్లి స్వరూప, రెండో విజేతగా పచ్చల నడుకుడకు చెందిన పోతుల శ్రేష్ఠ గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు.  వీరికి చెరో 5కేజీల లడ్డు లను యూత్ అధ్యక్షులు బోగ రాము అందజేశారు. డ్రా లో గెలుపొందిన విజేతలకు సహృదయ యూత్ తరుపున అభినందనలు తెలిపారు.

More articles

Latest article