29 C
Hyderabad
Monday, August 3, 2026

కుంట గంగాధర్ కు జిల్లా ఉత్తమ ఏపీఎం గా అవార్డు,

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా లో ఏర్గట్ల మండలాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు గాను ఐకెపి తరపున జిల్లా ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్ ఎన్నికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఉత్తమ ఏపిఎం అవార్డు అందజేసి, సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, స్త్రీ నిధి రుణాల పంపిణీ, నూతన సంఘాల ఏర్పాటు, ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు అంశాలలో 100% లక్ష్యాన్ని పూర్తి చేయడమే కాకుండా రికవరీలో సైతం జిల్లాలో అగ్రస్థానంలో నిలిపానని, ఈ క్రమంలో నాతో కలిసి ఈ అవార్డు సాధించడానికి శ్రమించిన సీసీ రవికుమార్, మండల వివోఏలు, ఆపరేటర్ సుప్రియ, మహిళా సంఘాల ప్రతినిధులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఐకెపి తరఫున జిల్లా ఉత్తమ ఏపిఎం గా తనని ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్, డిఆర్డిఓ, అడిషనల్ డిఆర్డిఓ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article