27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వరద ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్

Must read

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల, బతుకమ్మ : సిరిసిల్లలో వరద ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.  కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. సిరిసిల్ల నర్మాల పర్యటన ముగించుకుని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు. పాల్వంచ వాగు వరదల వల్ల జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

More articles

Latest article