నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాజీ కౌన్సిలర్ కోనేరు సాయికుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు డేగ స్వామి, పి.అశోక్ కుమార్, ఆర్.పృథ్వీరాజ్ నజీర్ ఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
