రుద్రూర్, బతుకమ్మ : స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం, చేనేత సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చేనేత సంఘం సభ్యులు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.