27.2 C
Hyderabad

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Must read

📰 Generate e-Paper Clip

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌ లకు రెడ్ కార్నర్ నోటీసుల జారీ

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌ లను భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమైంది. ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు ఈమేరకు ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది.  వీరిని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.  డీహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపిస్తారు.

More articles

Latest article