. . . కవితను కలిపేందుకు నేనేం చేశాను కేసీఆర్ కు తెలుసు
. . . మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో పురుడు పోసుకోకముందే తాను, తన తండ్రి చేసిన కష్టం కేసిఆర్ కు తెలుసని నేను లేకుండా టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపన జరుగలేదని మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ సభలో టిఆర్ఎస్ నేత కవిత చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ జిల్లా భీంగల్ లో పర్యటించిన ప్రశాంత్ రెడ్డి మీడియా తో మాట్లాడి ఖండించారు. టిఆర్ఎస్ పార్టి పెట్టినప్పుడు కవిత రాజకీయాలలో, కనీసం తెలంగాణ ఉద్యమంలో లేరని మద్యలోనే పార్టీలోకి వచ్చి మధ్యలోనే పార్టీని వీడారని అన్నారు. కేసీఆర్ ప్రధాన అనుచరులనే ఆమె టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.కవిత నిర్వాకం వాళ్ళ కేసీఆర్ మనోవేధనకు గురవు తున్నారన్నారు. తాను కాంగ్రెస్ తో సంప్రదింపులు జరపడం అబద్దమని కొట్టిపారేశారు. కవిత కాంగ్రెస్ నేతలతో రహస్య సంప్రదింపులు జరుపలేదని భీంగల్ లక్ష్మి నర్సింహ స్వామీ సాక్షిగా చెప్పగలరా అని ప్రశ్నించారు. గత రెండున్నర సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరుపున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ ను కష్ట కాలంలో వదిలేసి వెళ్ళింది కవితనా నేనా అని కవితది కన్నీళ్ళ రాజకీయం అన్నారు.
