నా రాజకీయ ప్రస్థానానికి  కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తొలిమెట్టు

0 8,116

కరీంనగర్, బతుకమ్మ : నా రాజకీయ ప్రస్థానానికి  కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తొలిమెట్టు గా నిలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈమేరకు ఆయన ’ఎక్స్‘ వేదికగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికైన 12 మందికి  అభినందనలు తెలిపారు. ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా  పనితీరు ఉండాలని ఆకాంక్షించారు.   డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో కలిసికట్టుగా బ్యాంక్ అభ్యున్నతికి పాటు పడ్డామన్నారు. గతంలో కర్ర రాజశేఖర్‌ కి చైర్మన్ గా…మిగతా వారికి డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉండడంతో వారికి మద్దతు ఇచ్చామన్నారు.  కర్ర రాజశేఖర్ తో పాటు గెలిచిన డైరెక్టర్లలందరూ ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని చూరగొనే విధంగా బ్యాంకును ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.  పాలకవర్గానికి సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

Karimnagar Urban Bank is the first step in my political journey.

 

Leave A Reply

Your email address will not be published.