29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నకిలీ డాక్టర్ ను  అరెస్ట్ ను అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

నకిలీ డాక్టర్ ను  అరెస్ట్ ను అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులు

కామారెడ్డి, బతుకమ్మ:

బోగస్ ఎంబిబిఎస్ పత్రాలతో డాక్టర్ గా చలమాణి అవుతున్న నకిలిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కామారెడ్డి అధనపు ఎస్ పి చైతన్య రెడ్డి మాట్లాడుతు… జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ లో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్, అదార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ర్టార్ లాలయ్య కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు తెలిపారు.  రవింధర్ గాంధీ మెడికల్ కళాశాల నందు ఎమ్ బి బి ఎస్ చేస్తున్నట్టు చెప్పి ఆన్ లైన్ లో మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికెట్ లను డౌన్ లోడ్ చేసుకుని ఆయన పేరుకు దగ్గరగా ఉన్న  ఎల్ రవీందర్ రెడ్డి అనే డాక్టర్ సర్టిఫికెట్ లో పేరు మార్చిన నకిలీ డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని తెలిపారు.  రవింధర్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదని, అతని స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ గ్రామం అని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ దండెం లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రవింధర్  ఎండి జనరల్ మెడిసిన్, పిల్లల డాక్టర్ గా గతంలో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేసినట్టు తెలిపారు. కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. అతనిపై 11/2025, అండర్ సెక్షన్ 318 (4), 338, 336 (3), 340 (2) , 319 (2) బిఎన్ఎస్ సెక్షన్ లో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి నకిలీ ఆదార్ కార్డు, నకిలీ డాక్టర్ ధ్రువపత్రాలను, ఒక ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ  విలేఖరుల సమావేశంలో కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ రామన్, ఎస్సై లు పాల్గొన్నారు.

Kamareddy police arrested the fake doctor

More articles

Latest article