డిల్లీ, బతుకమ్మ : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన సూర్యకాంత్ తొలివ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు నెలకొల్పారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ ఆపదవిలో కొనసాగుతారు. ఈప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.