26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ఆస్పత్రిలో న్యాయమూర్తి ప్రసవం

Must read

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: ప్రభుత్వ ఆస్పత్రిలో వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జడ్జి జ్యోతిర్మయి మొదటి ప్రసవం 2023లో ఇదే ఆస్పత్రిలో అయ్యింది. న్యాయమూర్తికి మొదటి సంతానం ఆడ శిశువుకాగా, రెండో సంతానం మగ శిశువు. న్యాయమూర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకొని ప్రభుత్వ ఆస్పత్రుల సేవలపై విశ్వాసాన్ని మరింత పెంచారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article