నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ మైనార్టీలకు ఇవ్వాలని అన్నా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షులు మన్సూర్ ఆలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు సమీపిస్తున్న ఇప్పటికి క్యాబినేట్ లో ముస్లీంలకు స్థానం కలిపించకపోవడం దారుణం అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ కు ఇవ్వకపోతే 200 మైనార్టీలతో నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు. కొడంగల్ లో రోడ్డు వెడల్పు కోసం దర్గా తొలిగించినంధుకు మైనార్టీలకు సీయం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
