29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాత్రికేయుడు

Must read

📰 Generate e-Paper Clip

ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో  రూ.2 .80 లక్షల ఆర్థిక సాయం

బతుకమ్మ, ఆర్మూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ప్రజాపక్షం రిపోర్టర్ ఎనుగంటి రామచంద్ర గౌడ్ పనిచేస్తున్నారు.15 రోజుల క్రితం తన వీధి నిర్వహణలో నిర్మల్ నుండి తిరిగి వస్తుండగా సాయి నగర్ తండా వద్ద బైక్ ప్రమాదం జరగడంతో తలకు బలమైన గాయం అయింది.దీంతో మెరిగైన వైద్యం కోసం నిజాంబాద్ మనోరమ హాస్పిటల్ లో చేర్పించారు.15 రోజుల నుండి చికిత్స పొందుతున్నాడు మండలంలోని ప్రతి ఒక్కరు ఆప్తులు తోచిన సాయం అందించారు. రామచంద్ర బంధువైనటువంటి కరుణాకర్ గౌడ్ ఇజ్రాయిల్ దేశంలో పనిచేస్తుండడంతో తన వార్త సోషల్ మీడియాలో చూసి అక్కడ ప్రచారం చేయడంతో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వాసులు మానవత దృక్పథంతో 2,80000 రూపాలను జమచేసి ఇండియాకి పంపారు. తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సోమారపు రవి, ఉపాధ్యక్షులు రాకేష్ లు మంగళవారం మనోరమ హాస్పిటల్లో బాధితుని కలిసి తన భార్య అయిన సింధుకు హాస్పిటల్ ఖర్చులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇంతటి మానవత హృదయంతో ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article