బతుకమ్మ, నిజామాబాద్ సిటీ..
జే సీ ఐ జోన్ 12 లో జే సీ ఐ జోన్ అధికారిగా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన జిల్కార్ నయన్ ను. జే సీ ఐ ఇండియా అధ్యక్షులు రీకేశ్ శర్మ, జాతీయ పిన్ తో సత్కరించారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమం లో నగరానికి చెందిన జిల్కార్ నయన్ సత్కరం అందుకున్నారు. అదే విధంగా పి ఆర్ జోన్ అధికారి నికీల్ గుండా జే సీ ఐ ఇందూర్ నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించిన సేవల కార్యక్రమాలకు, ఇతర సమాజిక సేవలకు ఇంధూర్ అధ్యక్షులు మనోజ్ కుమార్ కు ఉత్తమ ప్రతిభ ప్రశంస పత్రలను జాతీయ అధ్యక్షులు ద్వారా అందచేశారు. ఈ కార్యక్రమం లో జే సీ ఐ జాతీయ అధికారులు, రమేష్ దడిగల, వినయ్ మెహతా, నిధి గుప్త, కిరణ్ బంటు, జోన్ అధ్యక్షులు గోవింద్ కాంకాని, శ్రేయ దీక్షిత్, జయంత్ పాల్గొన్నారు.
