వెబ్ న్యూస్, బతుకమ్మ : మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఎంఎంసీ (మహారాష్ట్ర- మధ్యప్రదేశ్- ఛత్తీస్ గడ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని, ఆయుధాలను విడిచి పెడతామని, అందరం ఒకేసారి లొంగిపోతామని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న ల లొంగుబాటు, హిడ్మా ఎన్ కౌంటర్ తో పార్టీ బలహీనమైందని, మిగితా వారు లొంగిపోవాలన్న కేంద్రం సూచనతో ఈకీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
