28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఐదో టౌన్ పరిధిలో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి నిజామాబాదు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మంగళవారం జైలు శిక్ష విధించినట్లు ఐదో టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ తెలిపారు. ఐదో టౌన్ ఏరియాలో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించామని తెలిపారు. ఈ సదర్భంగా అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి నిజామాబాదు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని తెలిపారు. వీరిలో నగరంలోని శివాజీ నగర్ కు చెందిన వన్నెపల్లి కర్ణాకర్, నాగారానికి చెందిన మహమ్మద్ మజర్ అలీకి నాలుగు రోజుల జైలు శిక్ష, నగరంలోని ఖిల్లా రోడ్డుకు చెందిన జనార్దన్ డావ్ వాగ్మారేకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

More articles

Latest article