27.6 C
Hyderabad
Wednesday, August 5, 2026

ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతి ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో సందడి చేశారు. అనంతరం టీఎన్జీవోస్ ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, టీఎన్జీవోస్ అధ్యక్షులు సుమన్ కుమార్, కార్యదర్శి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్బీఓఎస్ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

It is customary to offer Bonalu to the Goddess during the month of Ashada.

More articles

Latest article