సిఫార్సులు పంపిన ఏఈవోని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈవో బాపిరెడ్డి
శ్రీకాళహస్తీ, బతుకమ్మ : ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సిబ్బంది ఇష్టారాజ్యాంగ ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తున్నారు. ఈవిషయమై ముగ్గురు సిబ్బందికి ఈవో మెమోలు ఇచ్చారు. తెల్ల కాగితంపై ప్రోటోకాల్ ఉద్యోగి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి సిఫార్సులు పంపారు. గత 8 నెలలుగా ఏఈవో అడ్డగోలుగా దర్శనాలు చేయించినట్లు సమాచారం. ముగ్గురు సిబ్బందికి సమాధానం చెప్పాలని విద్యాసాగర్ రెడ్డి, దుర్గాప్రసాద్, విశ్వనాథ్ శర్మలకు ఈవో మెమోలు జారీ చేశారు.
