. . . సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సెక్రటరీ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సింగిల్ విండో పరిధిలో యూరియా పంపిణీ చేయడంలో సహకార సంఘ సిబ్బంది కొందరు రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తున్నారని ఆదివారం రైతులు ఆందోళన చేశారు. శనివారం మధ్యాహ్నం విండోకు యూరియా వస్తే ఆదివారం పండుగ రోజు సైట్ ఓపెన్ చేసి కొందరికి పంపిణీ చేసే ప్రయత్నం చేశారని రైతులు కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ అధికారి వచ్చి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపచేశారు.
