24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి  జిల్లా ఎస్పీ సింధూశర్మ

 

కామారెడ్డి, బతుకమ్మ : ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని కామారెడ్డి  జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు లో జిల్లా పోలీస్ అధికారులతో గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు మెరుగైన  సేవలు అందించడానికి పోలీస్ అధికారులు,సిబ్బంది పని చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు.  నేరాల నివారణ, నేర చేదనే లక్ష్యంగా పనిచేయాని సూచించారు. సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని  పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని  సూచించారు.   కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు  పని చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని  అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవిల యొక్క ప్రాముఖ్యత పై అవగాహన కల్పిస్తూ  ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు

Investigations in the Foxo and Grave cases should be completed expeditiously

డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  అసాంఘిక కార్యకలాపాలు  గంజాయి, జూదం,అక్రమ ఇసుక పి.డి.యస్ రవాణా  లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు. విధులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులు  మరియు సిబ్బందిని  గుర్తించి వారికి ఎస్పీ సింధు శర్మ ప్రశంష పత్రాలను అందజేయడం జరిగింది వారిలో  1.  ఎస్. అనిల్ ఎస్సై మాచారెడ్డి, 2.  గంగారెడ్డి ఏఎస్ఐ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ , 3. ప్రియాంక ఉమెన్ కానిస్టేబుల్ బిక్నూర్. 4. రాములు కానిస్టేబుల్ బిబిపేట్, 5 . విజయ్ కానిస్టేబుల్ కామారెడ్డి, 6. శిరీష ఉమెన్ కానిస్టేబుల్ దేవునిపల్లి, 7. నవీన్ కానిస్టేబుల్ దేవునిపల్లి 8. శ్రీనివాస్ సదాశివ నగర్ పోలీస్ స్టేషన్, 9. సాయిబాబా తాడ్వాయి పోలీస్ స్టేషన్,10.  భవిత ఉమెన్ కానిస్టేబుల్, 11. చంద్రయ్య కానిస్టేబుల్ నాగిరెడ్డిపేట్, 12., రవీందర్ కానిస్టేబుల్ పెద్ద కొడంగల్,13. నదీమ్ కానిస్టేబుల్ బిచ్కుంద,14. వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ నసరూళ్ళబాద్ , 15. జావిద్ కానిస్టేబుల్ నసరూళ్ళబాద్ గార్లకు ఎస్పి మేడం  ప్రశoష  పత్రాలను అందజేస్తూ అభినందించడం జరిగింది. ఈ సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఆర్ఐలు ఎస్ఐలు  తదితరులు పాల్గొన్నారు.

Investigations in the Foxo and Grave cases should be completed expeditiously

More articles

Latest article