వెబ్ న్యూస్, బతుకమ్మ : అంతర్జాతీయ సైబర్ క్రైం నెట్ వర్క్ ముఠాను ఏపీ సీఐడీ పోలీసులు రట్టు చేశారు. కాంబోడియా నుంచి నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను పట్టుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ అధికారుల సాయంతో రాష్ట్ర పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. వియత్నంకు చెందిన కీలక నిందితుడు హాడెను పోలీసులు పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేశారు. అతని నుంచి 1400 సిమ్ కార్డులు, పలు కీలక హార్ట్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఈముఠాలు భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి మోసాలు చేస్తున్నాయి.
