. . . జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి టి.రవి కుమార్
బోధన్, బతుకమ్మ :
రానున్న ఇంటర్ పరీక్షలు ఎలాంటి లోపాలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి టి.రవి కుమార్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులకు సూచనలు ఇచ్చారు. బోధన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల స్ట్రాంగ్ రూమ్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశ్నాపత్రాలను భద్రపరిచిన గదిని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తిన పక్షంలో వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని, ప్రశ్నాపత్రాల రహస్యతను కాపాడటంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా విద్యాధికారి స్పష్టం చేశారు.

