25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

స్కూల్ బస్సులు, ట్రావెల్ బస్సులు తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, సౌత్ రూరల్ సీ.ఐ సురేష్, ఆరవ టౌన్ ఎస్ హెచ్ ఓ వెంకట్రావు, ఆర్టీవో అధికారులతో ఆరవ టౌన్ పరిధిలో గల డైరీ ఫార్మ్ కమాన్ వద్ద స్కూల్ బస్సులు, ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నియమాలను పాటించని తొమ్మిది బస్సుల మీద రూ.52,900 జరిమానా, ఒక స్కూల్ బస్సును సీజ్ చేశారు. ఈ తనిఖీలలో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు సరిగా పనిచేయకపోవడం, అగ్నిమాపక నిరోధక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సరియైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం గమనించారు. ప్రతి స్కూల్ బస్సు, ట్రావెల్ బస్సులు ప్రమాదం జరగకుండా, ప్రమాద బారిన పడితే ప్రయాణికులు రక్షించడం కోసం కావలసిన వస్తువులు, అత్యవసర ద్వారం గుండా బయటకు వెళ్లే విధంగా సౌకర్యాలు కలిగి ఉండాలని సూచించారు. లేనియెడల నియమాలు పాటించని బస్సుల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హెచ్చరించారు.

Inspection of school buses and travel buses

Inspection of school buses and travel buses

More articles

Latest article