24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మూడో స్పెల్  ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న  ప్రయోగ పరీక్ష కేంద్రాలను ఆదివారం  జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తనిఖీ చేశారు.  నిజామాబాద్ పట్టణంలో ప్రయోగ పరీక్షలు జరుగుతున్న రవి కాకతీయ జూనియర్ కళాశాల, సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల,  ఎస్సార్ జూనియర్ కళాశాల లను ఓం ఇంటర్ విద్య అధికారి తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్ధిన్ అస్లామ్, శ్రీమతి కనకమహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 12 కేంద్రాలను తనిఖీ చేశారు.  ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్య అధికారి, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పరిశీలించి సమీక్షించారు. ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రం లో  కెమెరాలకు జియో ట్యాగింగ్ పరిశీలించామని, కెమరాలు  ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. లైవ్ కెమెరాల ద్వారా  హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు.

Inspection of pilot test centres

More articles

Latest article