బతుకమ్మ, బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకతను నిర్ధారించేందుకు బోధన్ సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు 14, 15లను సందర్శించారు. ఈ సందర్శనలో వారు మంజూరైన ఇళ్లకు సంబంధించిన మార్కింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ లబ్ధిదారులతో ముఖాముఖి చర్చ నిర్వహించి, రూ.5,00,000/- మంజూరైన నగదు దశలవారీగా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే విధానాన్ని స్పష్టంగా వివరించారు. అవసరమైన పత్రాలు, విధివిధానాలు, ప్రతి దశలో ఉండే సమయం గురించి లబ్ధిదారులకు సమాచారం ఇచ్చారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పధక అమలులో వేగం పెంచడం, లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేయడం, మార్కింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
