ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్యాయి ఎస్ఐని బదిలీ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా కొనసాగుతున్న ఎస్సై మనోజ్ ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డయల్ 100కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ విషయమై సీపీ సాయిచైతన్య స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇందల్వాయి ఎస్సై మనోజ్ అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసినట్లు స్పెషల్ బ్రాంచి సిబ్బంది నివేదిక ఇచ్చారు. సోషల్ మీడియాలోనూ సంబంధిత ఎస్సై దాడి చేసిన వీడియోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై మనోజ్‌ను అటాచ్ చేసినట్లు తెలిసింది. కొత్తవారిని నియమించే వరకు డిచ్పల్లి సీఐ మల్లేశ్ తాత్కాలికంగా బాధ్యతలు చూడనున్నారు.
