23.4 C
Hyderabad

కరుణ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్: అనాధలకు అండగా పేదవారికి తోడుగా అనే నినాదంతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు, అనాధలకు ఆకలి తీరుస్తూ, వస్త్రాలు అందిస్తున్న కరుణ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ప్రెస్ బీటర్ ఇంచార్జ్ రెవరెండ్ ప్రేమ్ రాజ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పడగల్ సిఎస్ఐ దేవాలయంలో కరుణ ట్రస్ట్ నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించడం జరిగింది. ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కరుణ ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పడగల్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫాస్ట్రేట్ సెక్రెటరీ సందీప్, ట్రెజరర్ దయానంద్, ప్రాపర్టీ సెక్రెటరీ వసంత్, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article