బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మంగళవారం తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ -711 నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్ ను కళాశాల ప్రిన్సిపాల్ బి.గంగాధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎల్ఏ జిల్లా జనరల్ సెక్రెటరీ జయానంద్, టీజీఏఎల్ఏ జిల్లా అధ్యక్షులు జి లక్ష్మి నారాయణ, టీజీ ఎస్సీ, ఎస్టీ ఎల్ఏ జనరల్ సెక్రటరీ, టీజీఎల్ఏ జనరల్ సెక్రటరీ పర్శరాములు, పీఆర్టీయూ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
