29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుంద మున్సిపాలిటీ తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో నూతనంగా గెలుపొందిన చైర్మన్ కౌన్సిలర్ల పలు సమావేశాల కొరకు ప్రభుత్వ మున్సిపల్ భవనం లో వసతులు లేకపోవడంతో పక్కనే గల ప్రభుత్వ పాఠశాల భవనంలో తాత్కాలిక సమావేశ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సీమ శెట్కర్ మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కృషి చేద్దాం అని అన్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక నిధులను మంజూరు చేయించి మున్సిపల్ పరిధిలో గల ప్రతి వార్డ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం అని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హాయ్యుం మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వార్డ్ లో నీటి ఎద్దడి తీర్చడానికి 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 వార్డుల కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం సిబ్బంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article