26.3 C
Hyderabad
Monday, August 3, 2026

భారీ వర్షాల నేపథ్యంలో కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ క్షేత్రస్థాయి పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పర్యటించారు. భీంగల్ మండలం మెండోరా,పల్లికొండ గ్రామాల్లో పర్యటించి రహదారులను పరిశీలించారు. ఇంకా కొన్ని గ్రామాల మధ్య లెవర్ బ్రిడ్జిలు కారణంగా వర్షకాలం రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ సమస్యలకు పరిష్కారం చూపించవలసిన అవసరం ఉందని అన్న ఆయన తప్పకుండా ఇట్టి పనులను పూర్తి చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కూలిపోయే ఇళ్లలో ఎవరు ఉండవద్దని, నదులు,వాగులు వంకలు వంటి పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఇండ్లల్లోనే ఉండాలని ఆయన కోరారు.

More articles

Latest article