నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. గురువారం ఒకటో టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా నసీరుద్దీన్ అనే వ్యక్తి మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడ్డాడు. నసీరుద్దీన్ ను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రఘుపతి తెలిపారు.
