24 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్లకు జైలు శిక్ష, జరిమానా

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : పేకాట ఆడుతూ పట్టుపడిన పదిమందికి సోమవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వెయ్యి రూపాలయల జరిమానా, ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు బోధన్ రూరల్ ఎస్ఎచ్ ఓ మచ్చేందర్ తెలిపారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమ్మదగిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న పదిమందిని పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. సోమవారం వారిని బోధన్ లో గల న్యాయస్థాన సముదాయంలోనీ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ముందు హాజరుపరుచామని తెలిపారు. వారికి ఒక వెయ్యి రూపాయల జరిమానా, ఒకరోజు జైలు శిక్షను విధించారని తెలిపారు.

More articles

Latest article