నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో 629 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా సేకరిస్తున్నామని, నిర్దేశిత రైస్ మిల్లులకు వెంటవెంటనే ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధర్పల్లి మండలంలోని సీతాయిపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఇప్పటి వరకు సేకరించిన సన్న, దొడ్డు రకం ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
