మహబూబాబాద్, బతుకమ్మ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎస్సై ఉపేందర్ పై చర్యలు తీసుకోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన తెలిపింది. ఎస్సైపై చర్యలు తీసుకోకపోతే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హెచ్చరిస్తోంది. స్థానికులు మహిళను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
