26.8 C
Hyderabad

మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసై భార్య ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, బతుకమ్మ : హైదరాబాద్ లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద  విషాద ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల క్రితం సాయి కుమార్‌ (33)ను పొల్ల భవాని (28) వివాహమాడింది.  వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. భవాని మద్యానికి బానిస అయింది.  ఇంటి సమస్యలు, మద్యానికి బానిసవ్వడంతో .. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.  చివరికి తాను కలిసి ఉండలేనంటూ.. మరో వ్యక్తి వద్ద ఉంటానని భర్త  వెళ్లిపోయాడు.  తట్టుకోలేక.. మనస్థాపానికి గురై, మరింత మద్యం సేవించడం భవాని మొదలెట్టారు. ఈ క్రమంలోనే.. చనిపోతున్నానని భర్తకు మెసేజ్ చేసి సరస్సులోకి దూకి ఆత్మహత్య  చేసుకుంది.

More articles

Latest article