బిచ్కుంద, బతుకమ్మ: బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామం దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న క్రూజర్ టైర్ ఒక్కసారిగా పేలి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారు గాయపడ్డారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హైదరాబాద్ నుంచి జుక్కల్ నియోజకవర్గానికి వెళ్తుండగా గమనించి ఘటనాస్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను అంబులెన్స్ లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ డోంగ్లీ మండల అధ్యక్షులు రాజు పటేల్ తదితరులు ఉన్నారు.

