నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్‌మెంట్ లో ఎం.కాం ఈ- కమర్స్ విద్యార్థిని రామగిరి గంగోత్రి రచించిన హారర్ అండ్ క్రైమ్ ఫిక్షన్ జనని పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడాల, డైరెక్టర్ పి ఆర్ ఓ డాక్టర్ ఏ పున్నయ్య , కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ స్నాతకోత్తర స్థాయిలో అసంచరమైన ఆత్మవిశ్వాసము పట్టుదలతో రచన వ్యాసంగం వైపు మళ్ళిన విద్యార్థిని కుమారి గంగోత్రి అభినందనీయురాలు అన్నారు. తన మదిలో కదిలిన భావాలను ప్రత్యక్షంగా చూసిన మరియు పరోక్షంగా విన్న సామాజిక సంఘటనలను జ్ఞాపకాలను కథన రూపంలో పొందుపరిచిన ప్రయత్నం ప్రశంసనీయం అన్నారు. భవిష్యత్తులో సమాజ హిత రచనకాంక్షను అలవర్చుకోవాలన్నారు. ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్ మాట్లాడుతూ “జనని” పుస్తకం సామాజిక సమస్యలపై తీవ్రమైన దృష్టిని పెంచే ప్రయత్నం చేసిందని ఇందులో చూపిన సంఘటనలు, మనోభావాల ప్రకంపనలు పాఠకుడిని ఆలోచింపజేస్తాయన్నారు. డైరెక్టర్ పిఆర్ఓ పున్నయ్య మాట్లాడుతూ గంగోత్రి రచనలో సున్నితమైన స్పందనలు సృజనాత్మకమైన ఆలోచనలు కనిపిస్తున్నాయన్నారు. అనంతరం యువ రచయిత్రి గంగోత్రి రామగిరి నీ శాలువా, మెమొంటోతో అతిధులు అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఆంజనేయులు, డాక్టర్ జి శ్రీనివాస్, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ లెక్చరర్, డా. సంధ్యా దీప్తి డా. ఎం. సరిత, డా. ఇ. సంధ్యా ప్రియ దర్శిని, మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు, మేరు సంఘం రాష్ట్ర నాయకులు పోల్కం గంగా కిషన్, నగర కోశాధికారి యెన్ను సుదర్శన్, కార్యదర్శి దరభస్తు గంగాధర్, జిల్లా కార్యదర్శి గట్ల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

