27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆదర్శ రైతులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:గతంలో చేస్తున్న వ్యవసాయానికి ఇప్పుడు చేస్తున్న వ్యవసాయానికి చాలా తేడా ఉందని నూతన పనిముట్లతో వ్యవసాయాన్ని చేస్తూ పంట దిగుబడి ఎంతో చేస్తున్నారని రీజనల్ చైర్ పర్సన్ రాజన్న అన్నారు. వ్యవసాయదారులకు సరైన గుర్తింపు లేదని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సరైన గుర్తింపు అందిస్తున్నామని తెలిపారు. డిస్టిక్ చైర్పర్సన్ మామిడాల మనోహర్ మాట్లాడుతూ రైతుబిడ్డ, రైతే రాజు, రైతే దేశానికి వెన్న ముక్క, రైతు రాజ్యం అన్న పేర్లు ఎంత బాగున్నా చేతికి అందిన పంట గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాత్రమే రైతు రాజుగా నిలబడతాడని అన్నారు ప్రకృతి సహకరిస్తే ప్రతిదీ లభ్యమవుతుందని వారు తెలిపారు. లైన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ క్లబ్బులు మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారని అందులో 27 మంది వ్యవసాయదారులే ఉండడం చాలా గర్వకారణం అని పేర్కొన్నారు. మరి అలాంటి వ్యవసాయదారులు అందరికీ సన్మానించుకోవడం ఆనందదాయకం సభలో పచ్చ శాలువాలతో శోభాయమానంగా కనిపించడం చాలా సంతోషంగా ఉందని  తెలియజేశారు. మోర్తాడ్ మండల లోని ప్రతి గ్రామం నుండి ఒక రైతుని ఎంపిక చేసుకొని మోర్తాడ్ గ్రామంలోని అన్ని ఏరియాల నుండి ఆదర్శ రైతుల ఎంపిక చేయడం జరిగింది. వారందరినీ సర్టిఫికెట్ మెమొంటో పచ్చ శాలబాలతో సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article