25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మోర్తాడ్ ప్రిన్సిపల్ పెద్దన్నకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆరవ కన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టీజీ సిహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి పెద్దన్న మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం మోర్తాడ్ కళాశాల అభివృద్ధికి కృషి చేసినందులకై మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న కు సన్మానించడం అయినది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండల చైర్మన్ సన్మానం పొందడం మా మోర్తాడ్ కళాశాలకు దక్కిన గౌరవం అని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల స్టాఫ్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మర్రిపల్లి భూపతి, అకాడమీ కోఆర్డినేటర్ దశరథ్, సీనియర్ అధ్యాపకులు రాజయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article