నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జీతాలు అందక హోం గార్డులు ఇబ్బందులు పడుతున్నారని, 12వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, రోజువారీ ఖర్చుల కోసం హోంగార్డులు అప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు ప్రజావ్యతిరేక పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోం గార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
