నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైన భీంగల్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నాలుగు మండలాల పరిధిలో గురువారం అత్యధిక వర్షపాతం నమోదయి చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయి రవాణా వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆయా మండలాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు పడే సూచనల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల అన్ని విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు. నాలుగు మండలాల పరిధిలోని కేజీబీవీలు, మోడల్ స్కూల్లో, హాస్టల్లో, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు.
