నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఫ్యూచర్ లైన్ పాఠశాలలో శనివారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగులతో ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహం, సౌభ్రాతృత్వం, ఆనందానికి ప్రతీక అని తెలిపారు. పిల్లలు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని, పండుగల ద్వారా భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం రంగుల కాంతులతో కళకళలాడింది. ఈ సంబరాల్లో ఇంచార్జి లావణ్య, సంథ్య, గౌతమి, శిరిష పాల్గొన్నారు.

