25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కేజీబివి పాఠశాలలో ప్రారంభమైన హిందీభాష సంభాషణ శిక్షణ శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కేంద్రీయ హిందీ సంస్థాన్ హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకై హిందీ భాష సంభాషణ శిక్షణ శిబిరాన్ని రుద్రూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సోమవారం సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ప్రారంభించారు. హిందీ భాష ప్రాముఖ్యతను పెంపొందించుటకై విద్యార్థుల్లోని హిందీ సంభాషణను మెరుగు పరిచేందుకు ఈ శిక్షణ శిబిరం జూన్ 15 నుంచి 19 వరకు కొనసాగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాల్లో మొదటిసారిగా ఈ శిబిరం కేజీబీవీ రుద్రూర్ లో ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాంసింగ్, రిజనల్ డైరెక్టర్ భాస్కర్ క్రిష్ణజీ రూబే, హిందీ లెక్చరర్ డా.దీపేష్ వయాస్, పవం షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.

 

Hindi language conversational training camp launched at KGBV school.

More articles

Latest article