30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్ నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని శివాలయం నుండి వీరేశం స్వామి, సాయిలు స్వామి, రామేశ్వరరావు అనే ముగ్గురు శివదీక్ష మాలధారణ స్వాములు గురువారం కాలినడకన శ్రీశైలం పుణ్య క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. రుద్రూర్ మండల కేంద్రంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ పత్తి రాము స్వాములకు ఘనంగా స్వాగతం పలికారు. పండ్లు, పాలు సేవగా అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పత్తి నవీన్, అడప నవీన్, అక్కపల్లి నాగేందర్, ఇమ్రాన్, మంగళి సంతోష్, ఈర్వ అనిరుద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article