వెబ్ న్యూస్, బతుకమ్మ : దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో మంగళవారం రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని అప్పీల్ దాఖలు చేయగా.. కోర్టు డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈపేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ బ్లాస్ట్ లో 18 మంది మృతి చెందగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ కేసులో యాసిన్ బత్కల్ ను కీలక సూత్రధారిగా గుర్తించింది. ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో అసదుల్లాహ అక్తర్, యాసిన్ భక్తల్, తహసిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్,ఎజాక్ షాయిక్ ఉన్నారు. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
