బతుకమ్మ, కామారెడ్డి : రాజంపేట మండలంలోని కేజీబీవీ బాలికల వసతిగృహంలో ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు రాజంపేట వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా 224 మంది బాలికల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. 67 మంది విద్యార్థులకు అవసరమైన మందులను అందజేశారు. అనంతరం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించి, బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, వ్యాధి నివారణపై వివరించారు.ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శ్రీ వాణి, సూపర్వైజర్ మంజూర్, ఏఎన్ఎమ్ నాగలక్ష్మి, ఏఎన్ఎమ్ సబిత పాల్గొన్నారు.
