ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

0 1,321

ఆర్మూర్, బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని ప్రజాస్వామ్య దేశంలో అందరు వ్యతిరేకించాలని అన్నారు. జెమిలి ఎన్నికలు భారతదేశం మొత్తంగా అమలు చేయాలని గట్టి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాల మధ్యన చిచ్చు పెడుతుందని అన్నార., రాబోయే కాలంలో బిజెపి మతోన్మాద విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న జాదవ్ రాజు, నవీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.