25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బైసాఖీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కంటేశ్వర్ లోని ఫతెగడ్ గురుద్వారాలో ఆదివారం ఘనంగా బైసాఖీ పండగ సందర్బంగా సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి జిల్లాలోని సిక్కు సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. సిక్కుల నూతన సంవత్సర పండుగ వైసాఖీ /బైసాఖీ ఈ పండుగ ను ఖాల్సాపంత్ అని కూడా అంటారని అన్నారు. శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ మార్చ్ 30న 1699లో ఖాల్సాపంత్ ను కేశ్ ఘర్ సాహెబ్ అమృత్సర్ లో పంచ్ ప్యారే లను తయారు చేసి దేశ సమైక్యతకై కులామతాలకు తావులేకుండా దేశాన్ని ధర్మాన్ని రక్షించుటకై వివిధ మతాలకు చెందిన ఐదుగురికి అమృతం తాగించి పంచ్ ప్యారి గా నామకరణం చేసి ప్రతీ సిక్కు సోదరున్ని సింగ్ (లయన్) గా ప్రకటించారని తెలిపారు. ఈ పండుగను పంజాబ్, హార్యానా లో రైతుల పండుగ గా జరుపుకుంటారన్నారు. పంటలు బాగా పండి దిగుబడి బాగా రావాలని గురు గ్రంధ సాహెబ్ ను ప్రార్థిస్తారని తెలిపారు. జిల్లాలోని సిక్కు సోదరులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article