రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన చెందిన మూడ్ రాజేష్, మూడ్ రాహుల్ తన మొబైల్ ఫోన్ లను పోగొట్టుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ లను కనుగొని సోమవారం ఎస్సై సాయన్న పోలీస్ స్టేషన్ లో బాధితునికి తిరిగి ఫోన్ ను అప్పగించారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్ఐ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
